Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి కేటీఆర్ స్పష్టీకరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడుకు చెందిన బీజేపీ నేత జగన్నాథంతో మాట్లాడింది తానేనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 'స్థానికంగా పట్టున్న మీకు బీజేపీలో అన్యాయం జరుగుతున్నది.. అందువల్ల మీరు ఆ పార్టీకి కాకుండా మాకు సహకరించండి...' అంటూ కేటీఆర్ ఫోన్లో జగన్నాథంతో మాట్లాడినట్టు ఒక వీడియో వైరల్ అవుతున్న సంగతి విదితమే. గురువారం హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశం సందర్భంగా కొందరు ఇదే విషయాన్ని కేటీఆర్ వద్ద ప్రస్తావిస్తే... 'అవును నిజమే. జగన్నాథంతో నేనే మాట్లాడా. అందులో తప్పేముంది...' అంటూ ఆయన ఎదురు ప్రశ్నించటం గమనార్హం.
హైదరాబాద్లో జ్యోతిబాపూలే విగ్రహం...
హైదరాబాద్ నగరంలో మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామంటూ కేటీఆర్ హామీనిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాసగౌడ్ నేతృత్వంలో పలువురు ప్రతినిధులు గురువారం మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా జాజుల మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం బీసీల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నదని తెలిపారు. అందువల్ల తమ సంఘం తరపున కేటీఆర్కు ధన్యవాదాలు తెలిపామని అన్నారు.