Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డిసెంబరు ఏడు, ఎనిమిది తేదీల్లో హైదరాబాద్లో నిర్వహించబోయే ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్లోని మార్క్స్ భవన్లో మహాసభల ఆహ్వాన సంఘ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హరగోపాల్ మాట్లాడుతూ... దేశంలో ముంచుకొస్తున్న ఫాసిజాన్ని ఎదుర్కొనేందుకు విద్యార్థులందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీ, ఆరెస్సెస్ దేశాన్ని మతోన్మాదం వైపునకు తీసుకెళుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా మనదేశం మధ్య యుగాల్లోకి పోతున్నదని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నియంతృత్వ, నిరంకుశ పోకడలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షుడిగా గుమ్మడి నర్సయ్య, అధ్యక్షుడిగా ప్రొఫెసర్ హరగోపాల్, ప్రధాన కార్యదర్శిగా బోయిన్పల్లి రాము, కోశాధికారిగా ఎమ్.హన్మేశ్ను ఎన్నుకున్నారు.