Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సింగరేణి డైరెక్టర్ ఎన్.బలరామ్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఒడిశా రాష్ట్రంలో సింగరేణికి కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్ నుంచి ఈ ఏడాది ఉత్పత్తి ప్రారంభించడానికి వీలుగా తమ సంస్థ ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారని ఆ సంస్థ డైరెక్టర్ ఎన్.బలరామ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. చైర్మెన్, ఎమ్డీ ఎన్.శ్రీధర్ ఆదేశాల మేరకు గత మూడు రోజులుగా భువనేశ్వర్‌లో ఆ రాష్ట్ర అటవీ, వన్య ప్రాణి సంరక్షణ శాఖల ఉన్నతాధికారులు, అంగూల్ జిల్లా కలెక్టర్, ఇతర అధికారులను కలిసి ప్రాజెక్టును ప్రారంబించేందుకు సహకారం అందించాలని కోరినట్టు తెలిపారు. నైనీ బొగ్గు బ్లాక్‌కు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నుంచి స్టేజ్ -2 అనుమతులు లభించిన నేపథ్యంలో దీని అమలుకు తక్షణ ఆదేశాలు జారీ చేయాలనీ , ఉత్పత్తి ప్రక్రియ ప్రారంభించేందుకు మార్గం సుగమం చేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ బిశ్వాల్, ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ర్ (వన్య ప్రాణి) పొప్లి, అంగూల్ కలెక్టర్ సిద్ధార్థ్ శంకర్ స్వేన్ ను కోరారు. దీనిపైవారు సానుకూలంగా స్పందిస్తూ బొగ్గు ఉత్పత్తికి తమ పూర్తి సహకారాన్ని అందిస్తామంటూ హామీ ఇచ్చినట్టు తెలిపారు.