Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ సమస్యలపై చర్చ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) జనరల్ సెక్రటరీ థామస్‌రెడ్డి తెలిపారు. యూనియన్ ప్రతినిధి బందం గురువారం హైదరాబాద్‌లో మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్దన్‌ను కలిశారు. ఈ సందర్భంగా సంస్థను బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలతోపాటు ఆర్టీసీ కార్మికుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన పలు అంశాలను మంత్రుల దృష్టికి తెచ్చినట్టు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఆర్టీసీ కార్మికులకు, తెలంగాణ మజ్దూర్ యూనియన్‌కు ప్రభుత్వానికి ఒక సోదర బంధం ఏర్పండిందని తెలిపారు. తద్వారానే అనేక సమస్యలు పరిష్కారమయ్యాయని గుర్తు చేశారు. ప్రస్తుతమున్న ఒకటి, రెండు అంశాలపై కూడా మంత్రులు సానుకూలంగా స్పందించారని థామస్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే ఆర్టీసీ అభివృద్ధి పథంలో నడుస్తున్నదనే నమ్మకం తమకుందనీ, రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులంతా ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయం ఇదేనని విజ్ఞప్తి చేశారు.