Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకట్రాములు
నవతెలంగాణ- వీపనగండ్ల
రైతులకు అందించే ఎరువుల సబ్సీడీ ఎత్తేసేందుకే కేంద్ర ప్రభుత్వం పీఎం ప్రణరు పథకాన్ని ప్రవేశపెడుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్ రాములు అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం వనపర్తి జిల్లా రెండో మహాసభ శుక్రవారం జిల్లా అధ్యక్షులు రాజు అధ్యక్షతన వీపనగండ్ల మండల పరిధిలోని గోవర్ధనగిరిలో నిర్వహించారు. అంతకుముందు వ్యవసాయ కార్మిక సంఘం జెండాను జిల్లా ఉపాధ్యక్షులు వేణు ఎగురవేశారు. అనంతరం వెంకట్ రాములు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కొందరి చేతుల్లో పెట్టేందుకు యత్నిస్తోందన్నారు. రైతులకు సబ్సీడీ తగ్గించి సీఎం ప్రణరు పథకాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటు కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఆకలి, దారిద్రం, శిశుమరణాలు పెరుగుతున్నాయని చెప్పారు. ఆహార భద్రత చట్టాన్ని 11రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదని సుప్రీంకోర్టు ప్రశ్నించినా కేంద్ర ప్రభుత్వంలో మార్పు లేదన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎండి జబ్బార్, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల ఆంజనేయులు, ఉపాధ్యక్షులు అజయ్, వేణు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాల్రెడ్డి, ఉపాధ్యక్షులు యం డి.మహబూబ్ బాషా, ఆవాజ్ జిల్లా కార్యదర్శి పెద్ద ఖాజా, నాయకులు ఎం.వెంకటస్వామి, ఖాజా, హుస్సేన్, మౌలాలి, రవి, ప్రసాద్, శ్రీనివాసులు, మౌలాలి పాల్గొన్నారు.