Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ- మహబూబ్‌నగర్
జడ్చర్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన అసిస్టెం ట్ ప్రొఫెసర్‌పై చట్టపరమైన చర్య లు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ప్రశాంత్ డిమాండ్ చేశారు. శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో అసిస్టెంట్ ప్రొఫెసర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు తప్పు చేస్తే సరి చేయా ల్సిన లెక్చరర్లు, ప్రొఫెసర్లే తప్పు చేయడం సరైంది కాదన్నారు. జడ్చర్లలో ఇంత జరిగినా పోలీసులు ఇప్పటివరకు ప్రొఫెసర్‌పై చర్య తీసుకోకపోవ డం అనేక అనుమానాలకు తావిస్తుందన్నారు. వెంటనే ఆయనపై చట్టపర మైన చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు భరత్, నాయకులు ఈశ్వర్, నందు రాధిక పాల్గొన్నారు.