Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సిద్ధిపేట ఉద్యోగ గర్జన సంద ర్భంగా ఉద్యమ ఘట్టాలతో కూడిన 'యోధ' పుస్తకాన్ని మంత్రి కె తారక రామారావు శుక్రవారం హైదరా బాద్లో ఆవిష్కరించారు. 2009, అక్టోబర్ 21న నిర్వహించిన సిద్ధిపేట ఉద్యోగ గర్జన చారిత్రాత్మక రోజుని పురస్కరించుకుని మంత్రి వి శ్రీని వాస్గౌడ్ ఉద్యమ ప్రస్థానం, ఉద్య మంలో ఉద్యోగుల పాత్ర, ప్రధాన ఘట్టాలపై తెలంగాణ గెజి టెడ్ అధికారుల సంఘం (టీజీవో)తో పాటు ఉద్యోగ జేఏసీ కలిసి యోధ పుస్తకాన్ని రూపొందించింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ ఉద్యోగ జేఏసీ నాయకులతో కలిసి ఉద్యమ కాలంనాటి అనేక పోరాటాలను, ప్రధాన ఘట్టాలను గుర్తు చేసుకు న్నారు. కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ చైర్మెన్ ఎం రాజేందర్, సెక్రెటరీ జనరల్ వి మమత, టీఎన్జీవో, టీజీవో ప్రధాన కార్యదర్శులు రాయకంటి ప్రతాప్, ఎ సత్య నారాయణ, నాలు గో తరగతి ఉద్యోగుల సంఘం అధ్య క్షులు గడ్డం జ్ఞానేశ్వర్, టీజీవో కోశాధి కారి పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎస్ సహదేవ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షు లు ఎంబి కృష్ణ యాదవ్, నగర శాఖ అధ్యక్షుడు జి వెంకటేశ్వ ర్లు, టీఎన్జీవో అసోసియేట్ ప్రెసిడెంట్ ముత్యాల సత్య నారాయణ గౌడ్ పాల్గొన్నారు.