Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- యాదగిరిగుట్ట
తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా ఎంవి.రమణ, ప్రధాన కార్యదర్శిగా బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు. 13మంది ఆఫీస్ బేరర్స్.. 75మందితో రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బొలగాని జయరాములు, ఏల్గురి గోవిందు, బాల్న వెంకట మల్లయ్య, పామనగుళ్ల అచ్చాలు, గౌని వెంకన్న ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శులుగా బూడిది గోపి, చవుగోని సీతారాములు, గాలి అంజయ్య, ఎస్.రమేష్ గౌడ్, బండకింది అరుణ్, వి.వెంకట్ నరసయ్యను ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా తుమ్మల సైదయ్య, అబ్బగాని బిక్షం, మడ్డి అంజిబాబు, ఉయ్యాల నగేష్, గునిగంటి కృష్ణ, బత్తుల జనార్ధన్, కొండ అన్నపూర్ణ, బొలగాని రేణుక, రాగిర్ కిష్టయ్య, దూపటి వెంకటేష్, నమిలే మహేందర్, బత్తిని బిక్షం, గాజుల ఆంజనేయులు, అంతటి అశోక్, మద్దెల రాజయ్య, ఎరుకల సుధా హేమేందర్ గౌడ్ ఎన్నికయ్యారు.
కల్లుగీత కార్పొరేషన్‌కు రూ.5వేల కోట్ల బడ్జెట్ కేటాయించాలి
కల్లుగీత కార్పొరేషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.5వేల కోట్ల బడ్జెట్ కేటాయించి గీత కార్మికులకు న్యాయం చేయాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర నూతన అధ్యక్ష కార్యదర్శులు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎంవి.రమణ, బెల్లంకొండ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన ఆ సంఘం రాష్ట్ర మహాసభ చివరి రోజు శుక్రవారం నూతన కమిటీని ప్రకటించారు. ఈ సందర్భంగా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర మహాసభలో 30 జిల్లాల నుంచి ప్రతినిధులు పాల్గొన్నారని, గీత కార్మికుల సమస్యలపై చర్చించి 25 తీర్మానాల్ని ఆమోదించామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి సొసైటీకీ ఐదెకరాల భూమి ఇవ్వాలని ఉన్న 560 జీవో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి జిల్లా కేంద్రంలో నీరా తాటి, ఈత ఉత్పత్తుల పరిశ్రమలు నెలకొల్పాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో నిలిపివేసిన గీత సొసైటీలను తక్షణం పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పోరాటయోధులు సర్దార్ సర్వాయి పాపన్న పేరును జనగామ జిల్లాకు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా గీతన్నబంధు ప్రకటించి ప్రతి కుటుంబానికీ రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలన్నారు. దహన సంస్కారాల కోసం రూ. 50వేలు, గాయాలైన వారికి రూ.25 వేల సాయం చేయాలన్నారు.మహాసభలో తీర్మానించిన అంశాలను రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రిని కలిసి వినతిపత్రం ద్వారా అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కేజీకేఎస్ నాయకులు బొలగాని జయరాములు, రాగిరి కిష్టయ్య, దూపటి వెంకటేష్, గుల్లపల్లి వెంకటేష్, శ్రీరామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.