Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భద్రాద్రి రామాలయానికి సంబంధించిన సుమారు 650 ఎకరాల భూములను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దురాక్రమణకు పాల్పడుతున్నదని ప్రణాళికా సంఘం వైస్ చైర్మెన్ బోయినపల్లి వినోద్‌కుమార్ ఆరోపించారు. కేంద్రం ప్రభుత్వ వైఖరే ఇందుకు కారణమని పేర్కొన్నారు. రాముని పేరిట రాజకీయాలు చేయటం తప్ప భూముల రక్షణలో కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తెలిపా రు. శుక్రవారం భద్రాచలం నుంచి న్యాయ వాదులు, పలువురు ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు హైదరాబాద్‌లోని మంత్రుల నివాసంలో వినోద్ కుమార్‌ను కలిసి భద్రాద్రి రాముని భూముల ఆక్రమణల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాముడి భూముల అన్యాక్రాం తానికి కేంద్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఏకపక్షంగా ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రం లోని బీజేపీి ప్రభుత్వం విలీనం చేసిందనీ, దీంతో భద్రాద్రి రాముని భూములకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. ఆక్రమణదారుల నుంచి భూములను కాపాడాలని ఆ రాష్ట్ర రెవెన్యూ , ఎండో మెంట్, పోలీసు అధికారులకు భద్రాచలం దేవస్థానం ఈఓ ఫిర్యాదులు చేసినా.. ఆ ప్రభుత్వం పట్టించుకోలేదని పేర్కొన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురి కాకుండా ఉన్న ఏడు మండలాలలోని గ్రామాలను తిరిగి తెలంగాణకు స్వాధీన పర్చాలని, అందుకు పార్లమెంటులో చట్టం తీసుకుని రావాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.