Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ప్రభుత్వానికి పోతినేని సుదర్శన్రావు హెచ్చరిక
- కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన
నవతెలంగాణ-కొత్తగూడెం
ధరణి పోర్టల్ వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని, పట్టా హక్కులు కోల్పోతున్నారని, ఈ సమస్యలను పరిష్కరించుకుంటే దండయాత్ర తప్పదని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్రావు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ధరణి సమస్యలు పరిష్కరించాలని, సాగులో ఉన్న రైతులకు పట్టా హక్కులు కల్పించాలని, సర్వే నెంబర్లు మార్పులు చేర్పులు చేయాలని, వారసత్వ పట్టా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ముందు బైటాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కొక్కెరపాటి పుల్లయ్య అధ్యక్షతన జరిగిన సభలో పోతినేని సుదర్శన్రావు మాట్లాడారు. రాష్ట్ర ప్రభు త్వం భూ సమస్యల పరిష్కారం కోసం అత్యంత ప్రతి ష్టాత్మకంగా ధరణి పోర్టర్ని ముందుకు తీసుకొచ్చిం దన్నారు. దీని ద్వారా భూముల అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియ సులభతరమైనా.. సాగులో ఉన్న భూముల కి పట్టా హక్కు కోల్పోయిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గతంలో మంత్రుల ఉపసంఘం నెలల తరబడి అధ్యయనం చేసి పరిష్కరించింది ఏమీ లేదని విమర్శించారు. గతంలో అనుభవదారి, పట్టాదారు కాలం ఉండేవని, ధరణి వచ్చిన తర్వాత పట్టాదారు కాలం ఒక్కటే ఉందని చెప్పారు. కౌలుదారుల చేతిలో భూమి ఉన్నా వారికి ఏ విధమైన యాజమాన్య హక్కులు లేకపోవడం వల్ల రైతుబంధు, రైతుబీమా, బ్యాంకు రుణాలు వంటివి కోల్పోతున్నారని తెలిపారు. వారసత్వ పట్టా మార్పులకు కండిషన్స్ పెట్టడం సరైంది కాదన్నారు. సాదాబైనామా కింద దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారికి పట్టా కల్పించాలని డిమాండ్ చేశారు. పట్టాదారు పాస్ పుస్తకంలో పేర్లు మార్పిడి, సరిహద్దులు మార్చటం వంటి వాటికి అవకాశం ఇవ్వాలని కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ జిల్లా అయినందున వేల ఎకరాలకు సంబంధించి ధరణి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య, జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు కున్సోత్ ధర్మ, దొడ్డ లక్ష్మీనారాయణ, సాంబ శివరావు సహాయ కార్యదర్శి కొండబోయిన వెంకటేశ్వర్లు, వూకంటి రవికుమార్, నాయకులు శ్రీకాంత్, లక్ష్మీ, నర సయ్య, గడ్డం సత్యనారాయణ, గడ్డం వెంకటేశ్వర్లు, బొల్లి సత్య నారాయణ, కనక రత్నం, గోవిందు, రామిరెడ్డి, వెంకన్న, శ్రీదేవి, లక్ష్మి, భద్రమ్మ, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.