Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఐఏఎస్ గాంధీ ఎస్ఆర్ శంకరన్ 88వ జయంతి సందర్భంగా 'ఎస్ఆర్ శంకరన్ జీవితం-కృషి'అనే అంశంపై హైదరాబాద్‌లోని ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమిలో శనివారం ఉదయం తొమ్మిది గంటలకు సెమినార్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు అకాడమి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కె సతీశ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ముఖ్యఅతిధిగా ప్రొఫెసర్ జి హరగోపాల్, సభాధ్యక్షులుగా అకాడమి ప్రిన్సిపాల్ కె సురేందర్‌రెడ్డి, గౌరవ అతిధులుగా వై సత్యనారాయణ, నంద్యాల నర్సింహ్మారెడ్డి హాజరవుతారని తెలిపారు. ఆసక్తిగల వారు సకాలంలో హాజరు కావాలని కోరారు.