Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హౌంమంత్రి మహమూద్ అలీకి టీపీఎస్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
డీఏవీ పబ్లిక్ స్కూల్లో నాలుగేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన చిన్నారులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రజా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సమితి అధ్యక్షురాలు నీరా కిషోర్, ప్రధాన కార్యదర్శి సనా ఉల్లా ఖాన్, ఉపాధ్యక్షులు వినరు కుమార్ హౌంమంత్రి మహమూద్ అలీకి వినతిపత్రం సమర్పించారు. సంబంధిత స్కూల్ ప్రిన్సిపాల్, యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చిన్నారులపై లైంగిక దాడుల నివారణకు విధానాన్ని రూపొందించాలని సూచించారు. ముఖ్యంగా విద్యాసంస్థల్లో చిన్నారులపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పాఠశాలలో చైల్డ్ సైకాలజిస్ట్‌ను నియమించాలనీ, ఈ నియామకం స్కూల్ యాజమాన్యంతో సంబంధం లేకుండా చేస్తే స్వతంత్రంగా పని చేయగలుగుతుందని పేర్కొన్నారు.