Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సుస్థిర వ్యవసాయం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలి పారు. శుక్రవారం హైదరాబాద్ రెడ్‌హిల్స్ ఉద్యాన శిక్షణా కేంద్రంలో ఆయిల్ పామ్ సాగు పురోగతి, నూనెగింజల సాగు, యాసంగి పంటలపై నిర్వహించిన సమీక్షా సమా వేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరం జన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలా నుగుణంగా అవసరమైన పంటల సాగును ప్రోత్సహిం చాలని సూచించారు. నూనెగింజల సాగు ప్రోత్సాహంలో భాగంగా ప్రధానమైన ఆయిల్ పామ్ సాగును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించి ముందుకు సాగుతున్నదన్నారు. 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగుతో కొన్ని వేల కోట్ల రూపాయల రాష్ట్ర ఆదాయం పెరగడమే కాకుండా దాని ఉప ఉత్పత్తులు, వివిధ రకాల పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి పెరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం 1.78 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్యంగా పెట్టుకు న్నట్టు చెప్పారు. అధిక వర్షాలు,ఇతర ప్రతికూల వాతావ రణ పరిస్థితుల కారణంగా, ఇప్పటివరకు 30,849 ఎకరాల్లో సాగు మొదలయిందనీ, వచ్చే మార్చి నాటికి 1.78 లక్షల ఎకరాల లక్ష్యం చేరుకోవాలన్నారు. ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహం, సూక్ష్మ సేద్య పరికరాల కొరకు ప్రభుత్వం నిధులను అందుబాటులో ఉంచిందని తెలిపా రు. ఉద్యాన, వ్యవసాయ అధికారులు సంయుక్త సమావే శాలు నిర్వహించాలని ఆదేశించారు. యాసంగిలో శనగ లు, వేరుశనగ, మొక్క జొన్న, నువ్వులు, ఆవాలు, ఇతర అపరాలు, ఆము దం సాగును ప్రోత్సహించాలని సూచిం చారు. సమావేశం లో ఆయిల్ ఫెడ్ చైర్మెన్ రామకృషా రెడ్డి, ఉద్యానశాఖ డైరెక్టర్ హన్మంత రావు, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హన్మంతు, ఆయిల్ ఫెడ్ ఎండీ సురేం దర్, వ్యవసాయ అదనపు సంచాలకులు విజయ్ కుమార్, జిల్లాల ఉద్యాన, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.