Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన ద్వితీయ త్రైమాసికం (క్యూ2)లో కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవైబీ) 52 శాతం వృద్థితో రూ.250 కోట్ల నికర లాభాలు సాధించింది. మొండి బాకీల్లో తగ్గుదల వల్ల మెరుగైన ఫలితాలను నమోదు చేసినట్లు ఆ బ్యాంక్ తెలిపింది. క్రితం క్యూ2లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 21 శాతం పెరిగి రూ.821 కోట్లుగా చోటు చేసుకుంది. స్థూల నిరర్థక ఆస్తులు 341 బేసిస్ పాయింట్లు తగ్గి 3.97 శాతానికి దిగివచ్చాయని పేర్కొంది. మొత్తం వ్యాపారం 14 శాతం పెరిగి రూ.1,35,460 కోట్లుగా నమోదయినట్టు వెల్లడించింది.