Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపికైన అభ్యర్థుల వివరాలు
- డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.టీఎస్ఎల్పీఆర్బీ.ఇన్లో
- వీరికి త్వరలోనే పీఈటీ,పీఎంటీ పరీక్షలు : టీఎస్ఎల్పీఆర్బీ చైర్మెన్ శ్రీనివాసరావు
నవ తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి
అభ్యర్థులు ప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు జరిగిన ప్రిలిమినరీ పరీక్షా ఫలితాలను రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు చైర్మెన్ వీవీ శ్రీనివాసరావు శుక్రవారం ప్రకటించారు. గత ఆగస్టు నెలలో దాదాపు ఆరు వందల ఎస్ఐ పోస్టులకు , 16000 వేల కానిస్టేబుల్ పోస్టులకు బోర్డు ప్రిలిమినరీ పరీక్షలను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో ఎస్ఐ పోస్టులకు గాను 225668 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 105603 మంది అభ్యర్థులు పాసయ్యారు. మొత్తం అభ్యర్థులలో 46.80 శాతం మంది ప్రిలీమినరీలో అర్హతను సాధించారు. కానిస్టేబుల్ పోస్టుల కోసం 588891 మంది పరీక్షను రాయగా 184861 మంది అంటే 31.39 శాతం మంది నెగ్గారు. ఇక పీటీవో విభాగంలో కానిస్టేబుల్ పోస్టుల కోసం 41835 మంది పరీక్షను రాయగా 18758 మంది పాసయ్యారు. ఇక ప్రొహిబిషన్ ఎక్సైజ్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టుల కోసం 250890 మంది పరీక్షను రాయగా 109518 మంది అర్హతను సాధించారు. కాగా ఎస్ఐ పోస్టుల కోసం వెనుకబడిన తరగతులకు చెందిన వారు 49825 మంది అభ్యర్థులు అర్హతను సాధించగా , షెడూల్డ్ తెగలకు చెందిన వారు 26168 మంది పాసయ్యారు. అలాగే ఎస్టీ లకు చెందిన వారు 22571 మంది పరీక్షలో అర్హతను సాధించారు. కాగా ఎస్ఐ తత్సమాన పోస్టుల కోసం అర్హతను సాధించిన అభ్యర్థులు, కానిస్టేబుల్ సివిల్ తో పాటు తత్సమాన పోస్టులకు అరర్హతను సాధించిన అభ్యర్థులు త్వరలోనే నిర్వహించబోయే పీఎంటీ, పీఈటీ పరీక్షలకు సిద్ధంగా ఉండాలని ఈ సంధర్భంగా బోర్డు చైర్మెన్ శ్రీనివాసరావు కోరారు. అర్హతను సాధించిన అభ్యర్థులు పార్ట్ 2 దరఖాస్తు ఫైనల్ ఫరాలను ఆన్లైన్లో నింపాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. తమ అధికారిక వెబ్సైట్లో ఈ దరఖాస్తును నమోదు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అవసరమైన సర్టిఫికేట్లతో ఈ దరఖాస్తులను ఈనెల 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నవంబర్ 10వ తేదీ రాత్రి పది గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. టీఎస్ఎల్పీఆర్బీ. ఇన్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. అర్హతను సాధించిన అభ్యర్థులు, సాధించని అభ్యర్థుల వివరాలు తమ వెబ్ సైట్లో పొందుపరిచామని తెలిపారు.