Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్యతో కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుతో ప్రాతినిధ్యం చేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మునుగోడు నియోజకవర్గ ఆర్టీసీ ఉద్యోగుల సమాఖ్య నాయకులకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హామీ ఇచ్చారు. ఆ సమాఖ్య నాయకులు శుక్రవారం ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్‌తో జరిగిన చర్చల సారాంశాన్ని సాంబ శివరావుకు వివరించారు. మూడు డీఏలు, వాటి బకాయిలు, ఉద్యోగుల కు సకల జనుల సమ్మె వేతనాలు, 2019 జులై నుంచి రిటైర్ అయిన వారికి సెటిల్మెంట్ డబ్బులు, కరో నా కారణంగా నిలిపి వేసిన అడ్వా న్సును పునరుద్దరిస్తూ హిందూ, ముస్లిం, క్రిష్టియన్స్లకు అడ్వా న్సులు ఇవ్వడాన్ని యూనియన్ నాయకులు స్వాగతించారు. కానీ కార్మికులకు అతి ము ఖ్యమైన యూనియన్ల అను మతిని వేతన సవరణ (పేస్కేల్)పై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడాన్ని ఆర్టీసి స మాఖ్య నాయకులు కూనం నేనికి వివరించారు. సమస్య లను వెంటనే పరిష్కరించా లని నాయకులు కోరారు. కార్యక్రమంలో కె రాజిరెడ్డి, ఎస్ బాబు, ఈ వెంకన్న, ఎంవి చారి, కె యాదయ్య, బి జగన్మోహన్రెడ్డి, ఎస్ జగన్మోహన్ రెడ్డి, కె రామ దాసు, బి గోపాల్ తదితరు లు పాల్గొన్నారు.