Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముఠాను అరెస్టు చేసిన పోలీసులు
నవతెలంగాణ-కామారెడ్డిటౌన్
దొంగనోట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి శనివారం వెల్లడించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టేక్రియల్ బైపాస్ రోడ్డు ప్రాంతంలో వాహనాలను తనిఖీ చేస్తున్న సందర్భంలో ఓ కారు అతివేగంగా వెళ్తుండటంతో పోలీసులు వెంబడించారు. పోలీసులు వారిని పట్టుకున్నారు. వారి నుంచి 150 రూ.500 దొంగనోట్లు, 3 కత్తులు స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్టు చేసి దేవునిపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కామారెడ్డి రూరల్ సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పోలీసులు నిందితుల గ్రామాలకు వెళ్లి విచారించి బైంసా ప్రాంతంలో హుస్సేన్, నితిన్‌ను అరెస్టు చేసి వారి నుంచి 140 వంద రూపాయల దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నారు. రెండు మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. మరో వ్యక్తి నుంచి ల్యాప్‌టాప్, టీవీఎస్ కీబోర్డ్, లామినేషన్ మిషన్, కలర్ ప్రింటర్, డీటీపీ కలర్ ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తులు యూట్యూబ్‌లో చూస్తూ దొంగనోట్లు తయారు చేసేవారు. కాగా, వీరిలో ఏ 1గా నిందితుడిగా మహమ్మద్ ఉమర్ (బైంసా), ఏ 2గా పటాన్ (నాగారం-నిజామాబాద్), ఏ 3గా షేక్ హుస్సేన్ (ధర్మాబాద్ -మహారాష్ట్ర), ఏ4గా మతీన్కాస్ (భైంసా -నిర్మల్ జిల్లా), అబ్దుల్ (భైంసా)పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పర్చనున్నారు. చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన సిబ్బందికి ఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలిపారు.