Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ సర్కిల్ తపాలాశాఖలో 254 మంది వివిధ కేటగిరిల్లో ఎంపికైన ఉద్యోగులకు రోజ్‌గార్ మేళాలో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. కేంద్రప్రభుత్వం నిర్వహిస్తున్న 'మిషన్ రిక్రూట్మెంట్-1'లో భాగంగా శనివారం సికింద్రాబాద్ రైల్‌కళారంగ్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి ఈ లెటర్లను లబ్దిదారులకు అందచేసినట్టు తెలిపారు. పోస్టర్ అసిస్టెంట్లు 51 మంది, సార్టింగ్ అసిస్టెంట్స్ 21, గ్రామీణ డాక్ సేవక్ 182 మందికి నియామక పత్రాలు అందచేశారు. కార్యక్రమంలో తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కే ప్రకాశ్, హైదరాబాద్ రీజియన్ పోస్‌మాస్టర్ జనరల్ డాక్టర్ పీవీఎస్ రెడ్డి, హెడ్‌క్వార్టర్ డైరెక్టర్ పోస్టల్ సర్వీసెస్ కేఏ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.