Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ కార్మికుల వేతన సవరణ ప్రక్రియ ప్రారంభ అనుమతి కోసం యాజమాన్యం ఎన్నికల కమిషన్‌కు లేఖ రాయడాన్ని స్వాగతిస్తున్నట్టు టీఎస్ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తెలిపింది. ఎంప్లాయీస్ యూనియన్ ఆఫీసులో శనివారం జరిగిన చైర్మెన్ కే రాజిరెడ్డి అధ్యక్షతన జేఏసీ సమావేశం జరిగింది. కన్వీనర్ వీఎస్ రావు, కో కన్వీనర్లు ఎస్ సురేష్, గుడిసెల అబ్రహాం, కత్తుల యాదయ్య పాల్గొన్నారు. ఈనెల 22న ఆర్టీసీ చైర్మెన్‌తో జరిగిన చర్చలపై చర్చించారు. ఈ సందర్భంగా వేతన సవరణ అమలుచేయాలనీ, సంస్థలో కార్మిక సంఘాల కార్యకలాపాలను అనుమతిం చాలనీ, సీసీఎస్ బకాయిలు చెల్లించాలనీ, పనిభారాలను సమీక్షించాలనీ కోరారు. ఎన్నికల కమీషన్‌తో అనుమతి తీసుకుని, కార్మక సంఘాలతో చర్చించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఈనెల 22న సంస్థ చైర్మెన్ మూడు డిఏలు ఇస్తున్నామని చెప్పి, రెండు డిఏలకే ఆదేశాలు ఇచ్చారనీ, మరో డిఏ విడుదలకు కూడా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా జేఏసీ నేతలు మంత్రులు కే తారకరామారావు, హరీశ్‌రావు. పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మెన్‌కు ధన్యవాదాలు తెలిపారు.