Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎస్ఆర్ శంకరన్ జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయమైందని కుల వివక్ష వ్యవతిరేక పోరాట సమితి( కేవీపీఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.స్కైలాబ్‌బాబు తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని ఆ సంఘం రాష్ట్ర కార్యాలయంలో శంకరన్ 88వ జయంతి సంద ర్భంగా ఆయన చిత్రపటానికి ఎన్పీఆర్డీ రాష్ట్ర కార్యదర్శి ఎం అడివయ్యతో కలిసి పూల మాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్కైలాబ్‌బాబు మాట్లాడుతూ శంకరన్ అద్యంతం సామాన్యులకోసం పనిచేశారని తెలిపారు. నేటి అధికారులు ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలెన్నో ఉన్నాయని పేర్కొన్నారు. దళిత గిరిజనులకు జనాభా దామాషా ప్రకారం నిధులు కేటాయించే విధంగా స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్‌ను రూపొందించారని గుర్తుచేశారు.