Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లౌకిక రాజ్య స్థాపనే లక్ష్యం
- నేడు రాష్ట్రంలోకి భారత్ జోడో యాత్ర
- పీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్రెడ్డి
నవ తెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
దేశ స్వాతంత్య్ర పోరు సమయంలో సహాయ నిరాకరణ.. దండి సత్యాగ్రహం.. విదేశీ వస్తు బహిష్కరణ వంటి ఉద్యమాల మాదిరిగానే నేడు
రాజీవ్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర చేపడుతున్నారని తెలంగాణ పీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. భారత్ జోడో పాదయాత్ర కర్ణాటక నుంచి ఆదివారం తెలంగాణలోని నారాయణపేట జిల్లా కృష్ణ మండలంలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బ్రిటీష్ పాలకులను ఈ దేశం నుంచి వెళ్లగొట్టిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని గుర్తు చేశారు. కులమత రహిత సమాజం కోసం లౌకిక తత్వాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఈ దేశ పాలనలో అనేక పథకాలు తీసుకొచ్చినట్టు చెప్పారు. మనకన్నా ముందుగా స్వతంత్ర రాజ్యాంగం ఏర్పడిన పాకిస్థాన్ కంటే భారతదేశాన్ని వేగంగా అభివృద్ధి చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. ఇప్పుడు దురదృష్టవశాత్తు దేశ ప్రజలు మత ఛాందసవాదుల గుప్పిట్లో చిక్కుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారి నుంచి ఈ దేశాన్ని కాపాడుకోవాలని పిలుపుని చ్చారు. ఆయన వెంట నారాయణపేట డీసీసీ అధ్యక్షులు వాకిట శ్రీహరి, జీఎంఆర్ అభిలాష్ రావు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.