Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 28 వరకు వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశం
- 29న సీట్ల కేటాయింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరానికి ప్రవేశాల కోసం డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 25 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, దోస్త్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి శనివారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు రూ.400 ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 28న ప్రత్యేక కేటగిరీ (పీహెచ్సీ, సీఏపీ, ఎన్సీసీ, ఎక్స్‌ట్రాకరికులర్ యాక్టివిటీస్) విద్యార్థులకు విశ్వవిద్యాలయాల్లోని హెల్ప్‌లైన్ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని వివరించారు. ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు వెబ్ఆప్షన్ల నమోదుకు అవకాశముందని తెలిపారు. 29న సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొన్నారు. సీట్లు కేటాయించిన విద్యార్థులు ఈనెల 29 నుంచి 31వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాలని సూచించారు.