Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్పీహెచ్సీ చైర్మెన్ కోలేటి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమని తెలంగాణ రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ (టీఎస్పీహెచ్సీ) చైర్మెన్ కోలేటి దామోదర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు ఖాయమని పేర్కొన్నారు. బీజేపీపై ఉన్న భ్రమలు ప్రజల్లో తొలగిపోతున్నాయని వివరించారు. చాలా మంది నాయకులు టీఆర్ఎస్ గూటికి వస్తున్నారని తెలిపారు. ఈ వలసల జోరును చూసి బీజేపీ నాయకులు బెంబేలెత్తిపోతున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ను ఢకొీట్టలేని బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు. ఓటమి తప్పదనే ఒత్తిడిలో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని తెలిపారు. డబ్బు, మద్యం పంచినా, కుట్రలు చేసినా టీఆర్ఎస్ గెలుపును అడ్డుకోలేరని పేర్కొన్నారు. దుబ్బాక, హుజురాబాద్ తరహాలో మునుగోడులో బీజేపీ ఆటలు సాగడం లేదని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం నయాపైసా ఇవ్వలేదన్న వాస్తవాన్ని ప్రజలు గ్రహించాలని వివరించారు.