Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్పీఆర్డీ) జాతీయ మహాసభలు డిసెంబర్ లో హైదరాబాద్లో జరగనున్నాయి. ఈ మహాసభలకు 22 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరవుతారని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె వెంకట్, ఎం అడివయ్య ఒక ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 26 నుంచి 28 వరకు నిర్వహించే ఈ సభల్లో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని వారు పేర్కొన్నారు. శనివారం నిర్వహించిన రాష్ట్ర కమిటి సమావేశంలో తమ సమస్యలపై పలు తీర్మానాలు రూపొందించినట్టు వివరించారు. తెలంగాణలోని 13జిల్లాల్లో ఉన్న ఫ్లొరోసిస్ బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మహిళా వికలాంగులపై లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాటి నివారణకు చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర కోశాధికారి అర్ వెంకటేష్, ఉపాధ్యక్షులు జేర్కొని రాజు, అరిఫా, సహాయ కార్యదర్శి జే దశరథ్, వి ఉపేందర్, సభ్యులు శశికళ, సూరపంగా ప్రకాష్, బోల్లేపల్లి స్వామి, కషప్పా, ప్రభు స్వామి, రంగారెడ్డి, చంద్ర మోహన్, జంగయ్య, లలిత, భుజంగ రెడ్డి, అర్వపల్లి లింగన్న, విరబోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు