Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్, బీజేపీపై మహేశ్‌కుమార్ ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బీసీల ఓటర్లను మభ్యపెట్టేందుకే బీజేపీ, టీఆర్ఎస్ చేరికలను ప్రోత్సహిస్తున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని వలసలను ప్రోత్సహించినా మునుగోడులో కాంగ్రెస్ విజయం సాధించడం తధ్యమన్నారు. శనివారం హైదరాబాద్‌లో గాంధీభవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు.
టీఆర్ఎస్, బీజేపీ బీసీ నాయకులను పరస్పరం చేర్చుకోవడం, తిరిగి మళ్ళీ పార్టీలో చేర్చుకోవడం ద్వారా రాజకీయ ప్రలోభాలకు గురి చేస్తూ రాజకీయాలను కలుషితం చేస్తున్నాయని విమర్శించారు. పరస్పరం పార్టీలు మార్చుకోవడం ద్వారా ఓటర్లను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఆ పార్టీలు అనైతిక రాజకీయలకు పాల్పడుతున్నాయని చెప్పారు. బీసీ వర్గాలను ఆకర్షించేందుకు ఆ రెండు పార్టీలు కలిసి దొంగ డ్రామాలాడుతున్నారని విమర్శించారు.
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి విశేష స్పందన లభిస్తున్నదని తెలిపారు. అనేక ప్రాంతాల్లో బీజేపీ, టీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున తిరస్కరణకు గురవుతున్న తరుణంలో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్‌ను స్వాగతిస్తున్నారని చెప్పారు.