Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓడిపోయే సీటుకు ప్రచారమెందుకు?
- ఆస్ట్రేలియా పర్యటనలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన కాంగ్రెస్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమ వుతున్నాయి. శనివారం అక్కడి ఎన్ఆర్ఐలతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడిన వీడియో వైరల్ అవుతున్నది. 'మునుగోడులో నేను ప్రచారం చేస్తే.. ఓట్లు పెరుగుతాయి. అంతేకానీ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఓడిపోయే సీటుకు ప్రచారం ఎందుకు?... పాదయాత్ర చేద్దామనుకున్నా కానీ పార్టీలో ఒక్కొక్కరిది ఒక్కో గ్రూప్. మునుగోడులో రెండు అధికార పార్టీలు కొట్లాడుతు న్నప్పుడు మనమేం చేయగలం. నేను 25 ఏండ్లుగా రాజకీయాల్లో ఉండి తెలంగాణ కోసం పోరాటం చేశా. ఇక ఈ రాజకీయాలు చాలు' అంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపుతున్నాయి. ఈనేపథ్యంలో ఆయనపై కొంత మంది కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ప్రీతమ్ శుక్రవారం సోనియాగాంధీకి, ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌లో స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న వెంకట్‌రెడ్డి... మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయకుండా ఆస్ట్రేలియాకు వెళ్లారు. దీంతో ఆయన పరోక్షంగా బీజేపీకి సహకరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. మునుగోడు సిట్టింగ్ స్థానాన్ని దక్కించుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తుంటే, పుండు మీద కారం చల్లినట్టుగా ఆయన వ్యవహశైలి ఉందని పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ నాయకత్వంపై అసంతప్తితో ఉంటూ, ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉన్న ఆయన... అదే పార్టీకి చెందిన ఓ నాయకుడితో సంభా షించినట్లుగా ఆడియో ఒకటి శుక్రవారం వైరల్ ఆయన సంగతి తెలిసిందే. తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని గెలిపించా లంటూ మునుగోడు మండలం దుబ్బ కాల్వ గ్రామానికి చెందిన జబ్బార్ అనే కాంగ్రెస్ నాయకుడికి సూచిం చినట్టు ఆ ఆడియో వివాదాస్పదమైంది. ఓడిపోయే సీటుకు ప్రచారమెంటుకు అంటూ తాజాగా వ్యాఖ్యానిం చడం ద్వారా ఆయన పరోక్షంగా పార్టీ మారుతున్నారనే సంకేతాలిస్తున్నారంటూ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.