Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం బానిసత్వానికి వ్యతిరేకంగా చిన్ననాటి నుంచే పోరాడారని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో కొమురం భీం 121 జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జల్, జంగల్, జమీన్ నినాదంతో అడవిబిడ్డల హక్కుల కోసం భీం అలుపెరుగని పోరాటం చేశారని తెలిపారు. ప్రజల కోసం, తాను నమ్మిన సిద్ధాంతాల కోసం అమరుడయ్యాడన్నారు. 'మా తండాలో మా రాజ్యం' అనే ఆయన నినాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని తెలిపారు. బంజారా హిల్స్‌లో ఆదివాసీ ఆత్మగౌరవ భవనాన్ని నిర్మించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.