Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్పాట్‌ఫ్లోక్ కో- ఫౌండర్, సీఈఓ శ్రీధర్ శేషాద్రికి టాప్ 20 డీప్‌టెక్ ఇన్ల్ఫూయెన్సర్ అవార్డు 2022 దక్కినట్టు ఆ సంస్థ తెలిపింది. లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్ధ డీప్‌టెక్ సెంట్రల్ గ్లోబల్ ప్రస్తుత సంవత్సరానికిగానూ అనుసరించతగిన టాప్ 20 డీప్‌టెక్ ఇన్ఫ్లూయెన్సర్ల జాబితాను విడుదల చేసింది. దీనిలో ఎఐ, మెషీన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్‌లో ప్రత్యేకత కలిగి ఉండటంతో పాటుగా మిల్పిటస్, కాలిఫోర్నియాలో ప్రధాన కార్యాలయం కలిగి, హైద రాబాద్‌లో ప్రొడక్ట్ ఇంజినీరింగ్, ఇన్నోవేషన్ కార్యకలాపాలు నిర్వహిస్తో న్నస్పాట్ఫ్లోక్ టెక్నాలజీస్ చీఫ్ శ్రీధర్ శేషాద్రిని ఎంపిక చేసినట్లు పేర్కొంది.