Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దరఖాస్తులు ప్రారంభం
హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద విత్త సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్తగా 1422 సర్కిల్ బెస్ట్ ఆఫీసర్ (సీబీఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. అక్టోబర్ 18 నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్టు పేర్కొంది. ఆఖరు తేదిని నవంబర్ 8గా నిర్ణయించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఏదైనా విభాగంలో డిగ్రీ లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థుల వయో పరిమితి 21-30 ఏళ్లుగా నిర్ణయించింది. రిజర్వేషన్ కలిగిన అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపులు ఇచ్చింది. కాగా.. అభ్యర్థులకు విద్యార్హత పొందిన తర్వాత రెండేళ్ల అనుభవం ఉండాలని నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. ఏదైనా కమర్షియల్ లేదా రీజినల్ రూరల్ బ్యాంక్ లో ఆఫీసర్గా పని చేసిన అనుభవం ఉండాలని తెలిపింది. తెలంగాణకు 176 పోస్టులు రిజర్వ్ చేసింది.