Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ డిమాండ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ డీఏవీ పబ్లిక్ స్కూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడిపించాలని సీపీఐ(ఎం) గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శి ఎం.శ్రీనివాస్ కోరారు. సీపీఐ(ఎం) సిటీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చిన్నారిపై లైంగికదాడి ఘటన నేపథ్యంలో విచారణ జరిపి స్కూల్ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితుడు, స్కూల్ ప్రిన్సిపల్‌పై చర్యలతోపాటు, యాజమాన్యం వ్యవహార శైలిపై విచారించాలని, బాలికలకు తగిన రక్షణ కల్పించే వ్యవస్థల ఏర్పాటుపై ఆలోచించాలని కోరారు. డీఏవీ స్కూల్ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని, విద్యార్థులను ఇతర స్కూళ్లలో సర్దుబాటు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదే అయినప్పటికీ పేరెంట్స్‌కు భారంగా మారే పరిస్థితి ఏర్పడుతున్నదని వివరించారు. ఇప్పటికే డొనేషన్లు, ఫీజులు చెల్లించినందున మళ్లీ ఇతర స్కూళ్లలో చెల్లించే పరిస్థితి లేదని చెప్పారు. పేరెంట్స్‌పై భారం పడకుండా, విద్యాపరమైన నాణ్యత దెబ్బతినకుండా తల్లిదండ్రులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని, లేదా ప్రభుత్వమే డీఏవీ స్కూల్‌ను స్వాధీనం చేసుకొని నడిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.