Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఆ పార్టీ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందనీ, పార్టీలకు అతీతంగా తన సోదరుడు రాజగోపాల్‌రెడ్డికి మద్దతు ఇవ్వాలంటూ ఇటీవల కాంగ్రెస్‌పార్టీకి చెందిన ఓ కార్యకర్తతో ఆయన ఫోన్లో మాట్లాడిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై పది రోజుల్లో వివరణ ఇవ్వాలంటూ ఏఐసీసీ కార్యదర్శి తారిఖ్ అన్వర్ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైఖరి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందికి వస్తుందనీ, పార్టీ రాజ్యాంగం ప్రకారం ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ నోటీసు జారీ చేశారు. అయితే మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబంతో కలిసి ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న విషయం తెలిసిందే.