Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్కు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
టీఎస్ఆర్టీసీలో యూనియన్లపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆదివారం లేఖ రాసారు. అలాగే కార్మికులకు చెందిన సీసీఎస్, పీిఎఫ్ సంస్థల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. కార్మికులపై యాజమాన్య వేధింపులు ఆపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు. గతనెల 3వ తేదీ ఆర్టీసీ రక్షణ, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు. ఆ తర్వాత వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం ముందుకు వచ్చి, సెప్టెంబర్ 23న చర్చలు జరిపిందని గుర్తుచేశారు. పెండింగ్లో ఉన్న ఐదు డిఏల్లో రెండింటిని ఈనెల జీతంతో చెల్లిస్తామనీ, సకల జనుల సమ్మె కాలం జీతం చెల్లింపు, ఉద్యోగ విరమణ చేసినవారి టెర్మినల్ బెనిఫిట్స్ చెల్లించాలని నిర్ణయించడం పట్ల అభినందనలు తెలిపారు. అలాగే ఆర్టీసీ కార్మికులకు బకాయి ఉన్న రెండు వేతన ఒప్పందాల్లో ఒకదాన్ని నిర్ణయించడానికి మునుగోడు ఎన్నికల కోడ్ నుండి మినహాయింపు కావాలని ఎన్నికల కమిషన్ను కోరుతూ లేఖ రాయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎలక్షన్ కమిషన్ అనుమతించిన వెంటనే కార్మిక సంఘాలతో చర్చించి గౌరవప్రదమైన వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని లేఖలో కోరారు.