Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మెన్ ఇంతియాజ్ ఇషాక్
- సూర్యాపేటలో ఇస్లామిక్ ఎగ్జిబిషన్ ప్రారంభం
నవతెలంగాణ-సూర్యాపేట
బాలికల విద్య కోసం పాటుపడుతున్న మదర్సాలకు ప్రజలు తమవంతు సహాయ సహకారాలు అందించాలని తెలంగాణ మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ చైర్మెన్ ఇంతియాజ్ ఇషాక్ కోరారు. జమియా తుర్ రహమాన్ ట్రస్ట్ నిర్వాహకులు ముఫ్తీ అబ్దుల్ కాఫీ అస్రార్ ఆధ్వర్యంలో ఆదివారం సూర్యాపేట జిల్లాకేంద్రం ఖమ్మం రోడ్‌లోని మదర్సాలో నిర్వహించిన ఇస్లామిక్ ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో అట్టడుగు వర్గాల కుటుంబాల నుంచి వచ్చిన బాలికలకు ఉచితవిద్యతో పాటు ఉపాధిశిక్షణ అందిస్తున్న మదర్సా సేవలను ప్రశంసించారు. బాలికా విద్యతో పాటు తమ కళానైపుణ్యాన్ని ప్రదర్శించి అన్ని రకాల వస్తువులను తయారుచేసి తమ కాళ్ళపై వారు నిలదొక్కునే విధంగా శిక్షణ ఇస్తున్న అస్రార్‌ను అభినందించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉర్దూ మీడియం పాఠశాలల ద్వారా ముస్లిం బాల బాలికలకు ఉచిత విద్యా వసతి కల్పిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. సూర్యాపేట నియోజకవర్గంలో మంత్రి జగదీశ్‌రెడ్డి సహకారంతో మదర్సాల అభివృద్ధికి కృషి చేయనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా బాలికలు తయారు చేసిన వస్తువులను సందర్శించి వారికి అభినందనలు తెలిపారు. జమియా తుర్ రహమాన్ ట్రస్ట్ నిర్వాహకులు ముఫ్తీ అబ్దుల్ కాఫీ అస్రార్ మాట్లాడుతూ.. 23, 24, 25వ తేదీల్లో మూడు రోజుల పాటు ఎగ్జిబిషన్ కొనసాగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమం లో ముఫ్తీ ఉమర్ అభిదున్, ముఫ్తీ నాసిర్‌హుస్సేన్, ముఫ్తీహసీన్, ముఫ్తీ అబ్దుల్ నాపేఉస్మా, సోహెల్, మౌలానాజబ్బార్, మౌలానా రఫీదిన్, మౌలానాఅబ్దుల్ వాసే, కౌన్సిలర్ తహేర్పాషా, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.