Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశ వారసత్వ కళా సంపద...
- ఆయా ఉత్పత్తులపై జీఎస్టీని ఎత్తేయాలి : ప్రధాని మోడీకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
చేనేత వృత్తి వ్యాపారం కాదనీ, అది దేశ వారసత్వ సంపదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఆయా ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా ఎత్తేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఆమె ఆదివారం ఇదే అంశంపై ప్రధాని మోడీకి పోస్టు కార్డు రాశారు. చేనేత కార్మికులంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే పేదలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారని తెలిపారు. అలాంటి వారిని జీఎస్టీ పేరిట దోపిడీ చేయటం సరికాదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని కోట్లాది మంది చేనేత కార్మికులపై భారాన్ని తగ్గించేందుకు వీలుగా ఆ వృత్తికి సంబంధించిన ముడి సరుకులు, వస్త్రాలపై జీఎస్టీని పూర్తిగా ఎత్తేయాలని కవిత ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.