Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన ఆలోచనలకు దీపావళి వేదిక కావాలి : గవర్నర్ తమిళి సై సౌందరరాజన్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలందరికీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకుంటారని గుర్తుచేశారు. ఈ మేరకు ఆదివారం సీఎంఓ కార్యాల యం ఒక ప్రకటన విడుదల చేసింది. అజ్ఞానాంధకారాన్ని పారదోలి జ్ఞానపుకాంతులు ప్రసరింప చేయడమనే తత్వాన్ని దీపావళి మనకు నేర్పుతుందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ మాదిరే, దేశ ప్రజలందరి జీవితాల్లోనూ ఆనందపు ప్రగతి కాంతులు వెల్లివిరియాలనీ, సుఖ శాంతు లతో సిరి సంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు. బాణాసంచా పేల్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
గవర్నర్, మంత్రులు, ప్రముఖుల శుభాకాంక్షలు
అందరి జీవితాల్లో దీపావళి వెలుగులు నింపాలనీ, నూతన ఆలోచనలకు ఈ పండుగ వేదిక కావాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం రాజ్‌భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. చెడుపై మంచి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని పేర్కొన్నారు. అయితే, స్థానికంగా తయారైన పూజాసామాగ్రి, టపాసులను కొనుగోలు చేయడం ద్వారా ఆయా కార్మికుల జీవితాల్లో వెలుగులు పంచాలని గవర్నర్ ఈ సందర్భంగా ప్రజలకు సూచించారు. దీపావళి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ అధ్యక్షులు ఎ.రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్, రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, కేటీఆర్, మల్లారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ, ఇంటిల్లిపాది ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు.