Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఈనెల 27వ తేదీ మునుగోడు ఆర్టీసీ కార్మికుల సమాఖ్య జనరల్ బాడీ సమావేశం నిర్వహించనున్నట్టు ఆ సంఘం చైర్మెన్ కే రాజిరెడ్డి తెలిపారు.ఆదివారం చౌటుప్పల్లో సమాఖ్య నాయకుల సమావేశం జరిగింది. దీనిలో ఇటీవల ప్రభుత్వం, యాజమాన్యంతో జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాలను సమీక్షించారు. పెండింగ్లో ఉన్న డిమాండ్ల పరి ష్కారం కోసం చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణ, ఉప ఎన్నికల్లో మద్దతు అంశాలపై 27న జరిగే జనరల్ బాడీ సమావేశంలో చర్చించి, నిర్ణయం ప్రకటిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సమాఖ్య ముఖ్య సలహాదారు బూడిద జగన్ మోహన్ రెడ్డి, వైస్ చైర్మెన్లు కత్తుల యాదయ్య, సుర్కంటి మోహన్ రెడ్డి, కన్వీనర్ ఎమ్వీ చారి, కో కన్వీనర్లు కొవ్వూరు యాదయ్య, జీ నర్సింహా, షేక్ మోసిన్, కోశాధికారి కే రామదాసు పాల్గొన్నారు.