Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1,483 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నాం
- మునుగోడు ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
- రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో ఇప్పటి వరకూ అక్కడ రూ.2.49 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. మొత్తం 12 కేసులను నమోదు చేశామనీ, 1,483.67 లీటర్ల మద్యాన్ని పోలీసులు, ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారని వివరిం చారు. ఆదివారం హైదరాబాద్‌లో వికాస్‌రాజ్ మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికను సజావుగా నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈవీఎంలు, పోస్టల్ బ్యాలెట్ పేపర్ల ముద్రణ పూర్తయిందని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, పోటీలో ఉన్న అభ్యర్థుల సమక్షంలో ఈవీఎంల పరిశీలనను ప్రారంభించామని తెలిపారు. 35శాతం అదనపు ఈవీఎంలు, వీవీప్యాట్లను రిజర్వ్ అధికారికి కేటాయించామని చెప్పారు. పోలింగ్ సిబ్బందికి ఈనెల 27, 28 తేదీల్లో రెండో విడత శిక్షణిస్తామని వివరించారు. 25శాతం రిజర్వ్‌తోపాటు అవసర మైన సంఖ్యలో పోలింగ్ సిబ్బందిని నియమిం చామని తెలిపారు. ఈ క్రమంలో పౌరులు ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దని సూచించారు. టోల్‌ఫ్రీ నంబర్ 086822 30198కు ఫోన్ చేయటం ద్వారా ప్రత్యేక కంట్రోల్ రూమ్‌కు ఎలాంటి ఫిర్యాదులైనా చేయొచ్చని సూచించారు.