Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రోజ్గార్ మేళా పేరిట పచ్చి దగా..
- యువతకు మరోసారి ధోకా : ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
'నమో అంటే నరేంద్ర మోడీ కాదు.. నమ్మించి మోసం చేసే వాడు...' అని రుజువైందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల ముందు రోజ్గార్ మేళా పేరిట ప్రధాని మోడీ కొత్త డ్రామాకు తెరతీస్తున్నారని ఆయన విమర్శించారు. ఆ మేళాను పచ్చి దగా చర్యగా అభివర్ణించారు. యువతను మరోసారి మోసం చేసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొంటూ ప్రధాని మోడీకి కేటీఆర్ సోమవారం బహిరంగ లేఖ రాశారు. ఇలాంటి కుయుక్తులను పక్కనబెట్టి నిరుద్యోగ సమస్య పరిష్కారానికి నిబద్ధతతో కృషి చేయాలని సూచించారు. గతంలో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామంటూ మోడీ ప్రకటించారు... మరి ఈ ఎనిమిదేండ్లలో 16 కోట్ల ఉద్యోగాలివ్వాలి... ఇచ్చారా..? అని ప్రశ్నిం చారు. బీజేపీ హయాంలో ఇప్పటి వరకూ భర్తీ చేసిన ఖాళీ పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఏటా 50 వేల ఉద్యోగా లను కూడా సరిగ్గా భర్తీ చేయని కేంద్రం... రోజ్గార్ మేళా పేరిట 75 వేల మందికి నియామక పత్రాలను అందజేయటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఇది నిరుద్యోగ యువతపట్ల బీజేపీ క్రూర పరిహాసానికి నిదర్శమని విమర్శించారు. ప్రతీ ఎన్నికల ముందు ఇదే రీతిన యువతను మోసం చేస్తున్న మోడీ పాలనపైనా, ప్రభు త్వంపైనా తిరగబడే రోజు త్వరలోనే వస్తుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చ రించారు. ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాల పందేరం వల్ల సుమారు రెండున్నర లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు తమ కొలువులను కోల్పోయారంటూ కేటీఆర్ తన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర బీజేపీ సర్కార్ చర్యల వల్ల ప్రభుత్వ రంగ సంస్థల్లో సుమారు 50 శాతంగా ఉన్న రిజర్వుడ్ కేటగిరీలకు చెందిన వారికి భవిష్యత్తులో కూడా ఉద్యోగావకాశాల్లేకుండా పోయే ప్రమాదము ందని ఆందోళన వ్యక్తం చేశారు. లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తూ లాభాల్లో నడుస్తున్న ఆయా సంస్థల ను ప్రయివేటుపరం చేస్తూ వాటిని కార్పొరేట్లకు కట్ట బెడుతున్న కేంద్రం నేడు రోజ్గార్ మేళా అంటూ ప్రచారం చేసుకోవటం నిరు ద్యోగులను 'నోటితో నవ్వుతూ నొసటితో వెక్కిరించటమే అవుతుంది...' అని కేటీఆర్ విమర్శించారు.