Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మత విద్వేషాలను రెచ్చగొట్టి బీజేపీ రాజకీయాలు : ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క
నవతెలంగాణ-ములుగు
దేశ సమైక్యత కోసమే రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర చేపట్టారని ఎమ్మెల్యే డాక్టర్ సీతక్క తెలిపారు. ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి బీజేపీ రాజకీయం చేస్తోందని విమర్శించారు.రాహుల్ గాంధీ పాదయాత్ర 23న రాష్ట్రంలో ప్రారంభమైంద న్నారు. ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నవంబర్ 1న పెద్దఎత్తున హైదరాబాద్‌లోని గచ్చిబౌలికి తరలివచ్చి రాహుల్ గాంధీకి మద్దతు తెలపాలన్నారు. జోడోయాత్ర విజయవంతం కోసం కార్యకర్తలు కంకణబద్ధులై పని చేయాలని, తెలంగాణలో ప్రతి గడప నుంచి ఈ యాత్రలో పాల్గొనే విధంగా పార్టీ శ్రేణులు చొరవ చూపాలన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్‌గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, ఫిషర్మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి తదితరులు ఉన్నారు.