Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులపై చర్యలు తీసుకోండి : కోదండరాం మౌన దీక్ష
- రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వినతి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర మంత్రులు మునుగోడులో విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారనీ, వారిపై తగిన చర్యలు తీసుకోవాలని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షులు, ప్రొఫెసర్ కోదండరాం కోరారు. ఎన్నికల నియమాలను తుంగలో తొక్కుతున్నప్పటికీ కమిషన్ పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. తక్షణమే మంత్రులకున్న ఎస్కార్టును తక్షణమే రద్దు చేయాలని కోరారు. ఈమేరకు మంగళవారం హైదరాబాద్ రాణిగంజ్ బుద్ధభవన్‌లోని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) కార్యాలయం ముందు ఆయన బైఠాయించి మౌనదీక్ష చేపట్టారు. అనంతరం సీఈఓ వికాస్‌రాజ్‌ను కలిసి మునుగోడులో జరుగుతున్న అక్రమాలు, ఉల్లంఘనలపై ఫిర్యాదు చేశారు. వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందని పేర్కొన్నారు. ప్రలోభాలకు లోనుకాకుండా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఈ సందర్భంగా కోదండరామ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.