Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ
- మునుగోడులో టీఆర్ఎస్ను గెలిపించాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశానికే ప్రథమ శత్రువు బీజేపీ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి కోమటిరె డ్డి రాజగోపాల్‌రెడ్డిని ఓడించాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమా వేశంలో ఆయన మాట్లాడుతూ డబ్బు, అధికారం అడ్డుపెట్టుకుని గెలవచ్చనే ధీమాతో బీజేపీ నాయకులున్నారని చెప్పారు. గతంలో గెలిపించిన ఓటర్లను, ఆయన కుటుంబానికి ఎన్నో పదవులిచ్చిన కాంగ్రెస్ పార్టీని, ఆ ఎన్నికల్లో మద్దతిచ్చిన సీపీఐని రాజగోపాల్‌రెడ్డి మోసం చేశారని విమర్శించారు. తమ్మునికి ఓటేయాలంటున్న కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిది అనైతికమని అన్నారు. నల్లగొండ జిల్లాలో మోసగాళ్లు ఎవరంటే కోమటిరెడ్డి బ్రదర్సేనని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా తమ్మునికి ప్రచారం చేయాలనుకుంటే వెంకట్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బ్రిటన్ నూతన ప్రధాని రిషి సునాక్ విజయం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు ప్రధానిగా ఉన్న లిజ్ ట్రస్ చేసిన వాగ్ధానాన్ని నెరవేర్చనందుకు 45 రోజుల్లోనే రాజీనామా చేశారని చెప్పారు. కానీ భారత్‌లో ఎనిమిదేండ్లలో అన్ని రంగాల్లో విఫలమైన ప్రధాని మోడీ ఇంకా కొనసాగుతున్నారని ఎద్దేవా చేశారు. శ్రీలంకను మించిన దుర్భర ఆర్థిక పరిస్థితు లు భారత్‌లో నెలకొన్నాయన్నారు. మోడీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందనీ, రాజ్యాంగ విలువలకు ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ దేవాలయం, మసీదు పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూ వైఫల్యాలను కప్పి పుచ్చు కుంటున్నారని చెప్పారు. ప్రశ్నిస్తే వరవరరావు, సాయిబాబా వంటి వారిని జైళ్లో వేశారనీ, బెయిల్ వచ్చినా విడుదల చేయడం లేదన్నారు. రాజ్యాంగ సంస్థలైన ఎన్నికల కమిషన్, న్యాయవ్యవస్థ, సీబీఐ, ఈడీ వంటి వ్యవస్థలను ధ్వంసం చేశారని విమర్శిం చారు. టీఆర్ఎస్ పార్టీ కొన్ని తప్పిదాలు చేసినా బీజేపీ ప్రజా వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక విధానా లపై పోరాడుతున్నదని చెప్పారు. అందుకే మును గోడులో టీఆర్ఎస్కు మద్దతిచ్చామనీ, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. పార్టీ ఫిరా యింపు, ఎన్నికల్లో డబ్బును నిరోధించడంలో ఈసీ విఫలమైందన్నారు. ఎన్నికలో డబ్బు పంచే అభ్యర్థుల ను శాశ్వతంగా పోటీ అనర్హులుగా ప్రకటించేలా ఎన్నికల చట్టాల్లో మార్పులు తేవాల్సిన అవసర ముందన్నారు. దేశంలో విద్వేష ప్రసంగాలు చేయడ మే బీజేపీ లక్ష్యమని సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్‌పాషా విమర్శించారు. దేశంలో 2014 నుంచి 2019 వరకు విద్వేష ప్రసంగాలు 500 శాతం పెరిగినట్టు ఒక మీడియా సంస్థ సర్వేలో తేలిం దన్నారు. మోడీ ప్రభుత్వం దీన్ని సరి చేసుకోవాలనీ, అప్పుడే భారత్‌కు ఐక్య రాజ్య సమితిలో శాశ్వత సభ్యత్వం వచ్చే అవకాశం ఉందని చెప్పారు. మోడీ పాలనలో ప్రజాస్వామ్యం పాతర వేయబడిందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి విమర్శించారు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిందనీ, నిరుద్యోగం పెరిగిందనీ, ధరలు ఆకాశానికి అంటుతు న్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వామపక్ష, అభ్యు దయ భావాలున్న మునుగోడు ప్రజలు బీజేపీ ఆటలు సాగనివ్వబోరని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ, ఎన్ బాలమల్లేశ్, ఈటి నర్సింహా, రంగా రెడ్డి జిల్లా కార్యదర్శి పాల్మాకుల జంగయ్య పాల్గొన్నారు.
అజీజ్ పాషాకు సన్మానం
విజయవాడలో ఇటీవల జరిగిన సీపీఐ 24వ జాతీయ మహాసభలో ఆపార్టీ జాతీయ కార్యదర్శిగా ఎన్నికైన సయ్యద్ అజీజ్ పాషాను బుధవారం మఖ్దూ ం భవన్లో సన్మానించారు. వివిధ వర్గాలకు చెందిన వ్యక్తులు ఆయనకు పూలమాల వేసి సత్కరించారు. కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, పశ్య పద్మ, ఎన్ బాలమల్లేశ్, ఈటి నర్సిం హాతోపాటు వాహీద్, అహ్మద్ తదితరులున్నారు.