Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోలేటి దామోదర్ ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎనిమిదేండ్లుగా రాష్ట్రానికి అన్యాయం చేస్తూ వచ్చిన బీజేపీ నేడు కొత్త నాటకాలకు తెరతీస్తున్నారని తెలంగాణ రాష్ట్ర పోలీసు గృహ నిర్మాణ సంస్థ చైర్మెన్ కోలేటి దామోదర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం ఖరారైందని మంగళవారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ద్వితీయ స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు. మునుగోడు ప్రజల ఆశలను వమ్ము చేసిన బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డికి ఓట్లడిగే హక్కు లేదని తెలిపారు. తమ్ముడికి ఓట్లేయాలంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రచారం చేయడం ద్వారా ఆ రెండుపార్టీల మధ్య ఉన్న బంధం కనిపిస్తున్నదని పేర్కొన్నారు. చీకటి ఒప్పందాలతో వస్తున్న ఆయా పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.