Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ పాలిత రాష్ట్రమైన కర్నాటకలో గీత కార్మికుల ఉపాధిని దెబ్బతీసే విధంగా కల్లును నిషేధించటం దారుణమని ఈడిగ రాష్ట్రీయ మండలి జాతీయ అధ్యక్షులు డాక్టర్ ప్రాణానంద స్వామి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ క్యాంప్ కార్యాలయంలో ఆయన్ను కలిసి అక్కడి పరిస్థితులు వివరించారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ గీత కార్మికుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా వృత్తిపై నిషేధం విధించడాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పలు వేదికలపై ఎండగట్టారని గుర్తుచేశారు. గీత కార్మికుల కోసం తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతత్వంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కర్ణాటకలోనూ అమలు చేయాలని అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ బీజేపీి పాలిత రాష్ట్రాలలో కులవృత్తులను, చేతి వృత్తులను నిర్వీర్యం చేస,ి వెనుకబడిన వర్గాలకు చెందిన ప్రజలను ఇబ్బందులకు గురి చేయడాన్ని విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రశాంత్ గౌడ్ అఖిల భారత గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూరెళ్ళ వేములయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.