Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 29న హైదరాబాద్‌లో కార్యాచరణ :
- రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎస్ఐసీ పరిరక్షణకు దేశవ్యాప్త ఉద్యమానికి 12 లక్షల మంది అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్లు సన్నద్ధం కావాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. ఈ ఉద్యమానికి హైదరాబాద్ దిక్సూచి కానుందనీ, ఈనెల 29న సమావేశంలో సంబంధిత కార్యాచరణను రూపొందిస్తామని చెప్పారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ ఎల్ఐసీని ప్రయివేటీకరించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలన్నారు. ఇందుకోసం అధికారులు, ఉద్యోగులు, ఏజెంట్స్ దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని కోరారు. ఎల్ఐసీ ఉద్యోగులు, కార్మిక వర్గం చేసే ఉద్యమానికి టీఆర్ఎస్ కార్మిక విభాగం సంపూర్ణంగా అండగా నిలుస్తుందని చెప్పారు. అన్ని రకాల ఉద్యమ సహాయ సహకారాలను అందిస్తామని అన్నారు. ఎల్ఐసీని ప్రయివేటీకరించే బీజేపీ ప్రభుత్వ చర్యలను ప్రజల్లో ఎండగడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్, కార్యదర్శి వెంకటేష్, ఎల్ఐసీ ఏజెంట్ల సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసాచారి, రాష్ట్ర అధ్యక్షులు ప్రభాకర్, వివిధ డివిజన్ల నాయకులు తిరుపతయ్య, రఘు, రవీంద్రనాథ్, జేఏసీ చైర్మెన్ బిఎన్ చారి, టీఆర్ఎస్ కార్మిక విభాగం ఇన్చార్జి ఎల్ రూప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.