Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
కోట్ల రూపాయల విలువైన నగలను ప్రభుత్వ సంస్థ నుంచి ఖరీదు చేసి నిధులను దారి మళ్లించిన వైనంపై ముసద్దిలాల్ జువెలర్స్ యజమాని సుకేశ్ గుప్తాను మంగళవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారి స్తున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన ఎంఎంటీసీ నుంచి అక్రమ పద్ధతుల ద్వారా దాదాపు రూ. 198 కోట్ల వరకు నగలను ఖరీదు చేసి ఆ నిధులను దారి మళ్లించినట్టు సుకేశ్ గుప్తాపై ఆరోప ణలున్నాయి. అంతేగాక, ఎంఎంటీసీకి తిరిగి చెల్లించాల్సిన డబ్బులను సకాలంలో చెల్లించక పోవటంతో రూ. 300 కోట్ల మేరకు సుకేశ్ గుప్తా అప్పులు పేరుకుపోయాయి. అయితే, ఈ అప్పులను వన్‌టైమ్ సెటిల్మెంట్ చేస్తానంటూ సుకేశ్ గుప్తా తానిచ్చిన హామీల్ని సైతం నిలబెట్టు కోకపోవటంతో ఈయనపై చర్యకు మొదట సీబీఐ చర్యకు ఉప క్రమించింది. అనంతరం ఈ కేసును దర్యాప్తునకు స్వీకరించిన ఈడీ అధికారులు ఇటీవలనే సుకేశ్ గుప్తాను అరెస్టు చేయటమే గాక హైదరాబాద్, విజయవాడ, గుంటూరులోని ముసద్దిలాల్ జువెలర్స్ కార్యాలయాల పైనా సోదాలు నిర్వ హించారు.
ఈ సందర్భంగా రూ. 148 కోట్ల విలువైన బంగారు నగలను సీజ్ చేయటమేగాక రూ. 1.98 కోట్ల నగదును సైతం స్వాధీనపర్చుకున్నారు. అయితే, ఎంఎంటీసీ ద్వారా సేకరించిన కోట్లాది రూపాయల నగలతో సుకేశ్ గుప్తా ఎలాంటి వ్యాపారాలు చేశారు? తద్వారా వచ్చిన ఆదాయాన్ని దేనికి వినియో గించాడు? విదేశాలకు తరలించాడా? తదితర కోణాల్లో ఈడీ తాజాగా సుకేశ్ గుప్తాను విచారి స్తున్నది. 25 నుంచి నవంబర్ 2 వరకు 9 రోజుల పాటు సుకేశ్ గుప్తాను ఈడీ కస్టడీకి ఇవ్వటంతో విచారణను ప్రారంభించారు. తమ కార్యాలయంలో సుకేశ్ గుప్తాను ఐదుగురు సభ్యులతో కూడిన ఈడీ బృందం విచారిస్తున్నట్టు తెలిసింది.