Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నాలుగేండ్లుగా ఉపాధ్యాయుల పదోన్నతులను ఎందుకు చేపట్టలేదని ఎస్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి సదానందం గౌడ్, ఎం పర్వత్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో లేని అవకాశం ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్న సమయంలో ఎలా సాధ్యమవుతుందని అడిగారు. ఇన్నేండ్లుగా పదోన్నతులు రాకపోవడానికి కారకులెవరో అర్థం చేసుకోవాలని బుధవారం ఒక ప్రకటనలో కోరారు. ఇంత వరకూ లేని అవకాశం అమాం తంగా కొత్తగా ఏమీ రాలేదని తెలిపారు. నాలుగేండ్ల నుంచి ఉన్న అవకాశమే ఇప్పుడూ ఉందంటూ న్యాయకోవిదులు, విద్యాశాఖ ఉన్నతాధికారులు చెప్తు న్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అంటూ అయోమ యం చేయడాన్ని మానుకోవాలని ఎస్టీయూటీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి బి భుజంగ రావు తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడక ముందే ఇలాంటి ప్రచారం చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. పదోన్నతులు, బదిలీలకు ఉన్న అవకా శాన్ని ఉపాధ్యాయులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.