Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉద్యానసాగు సగటులో తెలంగాణ టాప్
- బీజేపీకి మంత్రి నిరంజన్‌రెడ్డి హితవు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ అనుకూల విధానాలు మానుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యాన పంటల సాగులో తెలంగాణ రాష్ట్రం టాప్‌లో ఉందని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మామిడి విస్తీర్ణంలో 3.21 లక్షల ఎకరాలతో ఎనిమిదోవ స్థానంలో ఉందని తెలిపారు. మామిడి ఉత్పాదకతలో జాతీయ సగటు హెక్టారుకు 8.17 మెట్రిక్ టన్నులు, తెలంగాణలో సగటు 9.24 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి పెరిగిందని తెలిపారు. మిరపసాగులో 3.88 లక్షల ఎకరాలతో 6.51 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో దేశంలో రెండోస్థానంలో ఉందని తెలిపారు. ఆయిల్ పామ్ సాగులో 20 లక్షల ఎకరాల్లో సాగు లక్ష్యంగా ఈ ఏడాది చివరి వరకు విస్తీర్ణంలో అగ్రస్థానానికి చేరుకోనున్నదని గుర్తు చేశారు. ఆయిల్‌పామ్ ఉత్పత్తిలో ఇప్పటికే 3.61 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో దేశంలో రెండోస్థానంగా ఉందని పేర్కొన్నారు. రాబోయే కాలంలో రానున్న పంట ఉత్పత్తులను దృష్టిలో పెట్టుకుని కోహెడ మార్కెట్లో 200 ఎకరాల్లో అత్యాధునిక వసతులు కల్పిస్తామన్నారు. ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామంటూ బీజేపీ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చి పట్టించుకోవడం లేదని విమర్శించారు. రైతుల విషయంలో నరేంద్రమోడీ ప్రభుత్వానివి జూటా మాటలని మంత్రి ఎద్దేవా చేశారు.