Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్సిటీ కాంట్రాక్టు టీచర్ల జేఏసీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
మునుగోడు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ఆల్ యూనివర్సిటీస్ కాంట్రాక్టు టీచర్ల జేఏసీ మద్దతును ప్రకటించింది. ఈ మేరకు ఆ జేఏసీ చైర్మెన్ ఎం రామేశ్వర్రావు, కన్వీనర్ శ్రీధర్‌కుమార్ లోధ్ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులు, అధ్యాపకులను రెగ్యులరైజ్ చేస్తామంటూ ప్రభుత్వం వాగ్ధానం చేసిందని గుర్తు చేశారు. అందులో భాగంగానే జీవోనెంబర్ 16ను తెచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన కసరత్తు వివిధ శాఖల్లో జరుగుతున్నదని వివరించారు. కాంట్రాక్టు అధ్యాపకుల తరహాలోనే రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ స్పందించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించారు.