Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు కోట్ల పైనే! - ఏసీబీ దాడుల్లో వెల్లడి
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
భువనగిరి యాదాద్రి జిల్లా ఘట్కేసర్ సబ్‌రిజిస్ట్రార్ అవినీతి, అక్రమాలకు పాల్పడి రూ. 3 కోట్లకు పైనే ఆస్తులను సంపాదించినట్టు ఏసీబీ జరిపిన సోదాల్లో వెల్లడైంది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ అంజనీ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్కేసర్ సబ్‌రిజిస్ట్రార్‌గా పని చేస్తున్న వి.సీతారామ్ అక్రమాలకు పాల్పడి భారీ మొత్తంలో విలువైన ఆస్తులను కూడబెట్టినట్టు ఏసీబీకి సమాచారమందింది. ఈ నేపథ్యంలో ఏసీబీ సీతారామ్ నివాసంతో పాటు ఇతర ఆస్తులపై ఏక కాలంలో దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో లక్షల రూపాయలు విలువ చేసే నగలు, నగదుతో పాటు భూముల వివరాలు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు ఆ ఆస్తి విలువ రూ. 3,13,80,000గా తేల్చింది. అనంతరం నిందితుడు సీతారామ్‌ను అరెస్టు చేసి ఏసీబీ కేసుల ప్రత్యేక కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలుకు తరలించారు.