Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తిరుపతిలో తెలంగాణ రిజర్వేషన్ కౌంటర్ తనిఖీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్/ తిరుపతి
టీఎస్ఆర్టీసీని ప్రజలు ఆదరించాలని ఆర్టీసీ చైర్మెన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు. తిరుపతి ప్రధాన బస్టాండ్‌లో తెలంగాణ రిజర్వేషన్ కౌంటర్‌ను ఆయన బుధవారం తనిఖీ చేశారు. అనంతరం బస్టాండ్ వద్ద టీఎస్ఆర్టీసీ బస్సుల పార్కింగ్ స్థలాలను, సిబ్బంది విశ్రాంతి గదులను పరిశీలించారు. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో టికెట్‌తోపాటు వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులను సంస్థ అందిస్తున్న వసతులపై పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ అధికారులతో పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర రైతు విభాగం మాజీ అధ్యక్షులు ఈగ సంజీవ్‌రెడ్డి, టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ అధికారులు, మహబూబ్‌నగర్ డిప్యూటీ ఆర్ఎం రాము తదితరులు పాల్గొన్నారు.